LBF News

/ Sep 25, 2025

హోంబలే ఫిల్మ్స్‌ ‘కాంతార: చాప్టర్‌ 1’

రిషబ్‌ శెట్టి పుట్టినరోజు సందర్భంగా అద్భుతమైన కొత్త పోస్టర్‌ రిలీజ్‌` అక్టోబర్‌ 2, 2025న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ రిలీజ్‌

2022లో విడుదలైన ‘‘కాంతార’’ సినిమా ఇండియన్‌ సినిమా పరంగా సరికొత్త దిశగా అడుగు వేసింది. సంవత్సరం లోనే అతిపెద్ద స్లీపర్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. పాన్‌`ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్‌ క్రియేట్‌ చేసింది. కేజీఎఫ్‌, సలార్‌, కాంతార లాంటి బ్లాక్‌బస్టర్స్‌ ఇచ్చిన హోంబలే ఫిలింస్‌కి ఇది ఇంకో గొప్ప మైలురాయి అయ్యింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్‌ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రిషబ్‌ శెట్టి ఎప్పుడూ చూడని థ్రిల్లింగ్‌ అవతార్‌లో ఉన్న పోస్టర్‌ ఇప్పటికే ప్రేక్షకులలో సంచలనం సృష్టించింది. ఇప్పుడు, రిషబ్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, షూటింగ్‌ పూర్తయినట్లు అనౌన్స్‌ చేశారు.

లక్షలాది మందిని అలరించిన మాస్టర్‌ పీస్‌ ‘కాంతార: చాప్టర్‌ 1’ ప్రీక్వెల్‌ షూటింగ్‌ పూర్తి చేసుకుంది. కొత్తగా విడుదలైన పోస్టర్‌ ఉత్సాహాన్ని మరింత పెంచింది. రిషబ్‌ శెట్టి, అతని అభిమానులకు ఇది పర్ఫెక్ట్‌ బర్త్‌ డే గిఫ్ట్‌. కాంతార: చాప్టర్‌ 1 లక్షలాది మందిని అలరించిన లెజెండ్‌ మూలాలకు ఆడియన్స్‌ ని తీసుకెళుతుంది. 

కొత్త పోస్టర్‌ను మేకర్స్‌ సోషల్‌ నే షేర్‌ చేస్తూ.. 

చకాంతారా` లక్షలాది మందిని కదిలించిన మాస్టర్‌ పీస్‌ ‘కి ప్రీక్వెల్‌.

లెజెండ్‌ వెనుక ఉన్న ట్రైల్‌బ్లేజింగ్‌ ఎనర్జీ ఏరిషబ్‌ శెట్టికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

డివైన్‌ సినిమాటిక్‌ విజువల్‌ వండర్‌ మోస్ట్‌ అవైటెడ్‌ ప్రీక్వెల్‌…

చకాంతార చాప్టర్‌ 1 అక్టోబర్‌ 2, 2025న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ .. అని పోస్ట్‌ చేశారు.

మేకర్స్‌ విడుదలను అనౌన్స్‌ చేయడంతో సినిమా కొత్త పోస్టర్‌ ‘కాంతారా: చాప్టర్‌`1’ చుట్టూ ఉన్న ఉత్సాహం మరింత పెరిగింది. హోంబాలే ఫిల్మ్స్‌ విజన్‌, రిషబ్‌ శెట్టి అంకితభావం, ఫస్ట్‌ చాప్టర్‌ లెగసీతో ఈ చిత్రం మరో సినిమాటిక్‌ మైలురాయిగా మారే దిశగా సాగుతోంది.

2022లో వచ్చిన ఈ మాస్టర్‌ పీస్‌ లెగసీని ముందుకు తీసుకెళ్లడంలో హోంబాలే ఫిల్మ్స్‌ ఎక్కాడ రాజీపడటం లేదు. కాంతారా చాప్టర్‌`1 కోసం జాతీయ, అంతర్జాతీయ టెక్నిషియన్స్‌ తో యుద్ధ సన్నివేశాన్ని రూపొందించారు. 500 మందికి పైగా ఫైటర్లు, 3000 మంది జూనియర్‌ ఆర్టిస్టులు, 25 ఎకరాల్లో ఓ టౌన్‌ సెట్‌ వేసి, దాదాపు 45 నుంచి 50 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. ఇది ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్‌ సీన్‌ గా ఉండబోతోంది.

ప్రస్తుతం హోంబలే ఫిలింస్‌ సక్సెస్‌ పరంపర కొనసాగుతోంది. వచ్చే రోజుల్లో కాంతార: చాప్టర్‌ 1 (అక్టోబర్‌ 2, 2025), సలార్‌: పార్ట్‌ 2 ? శౌర్యాంగ పర్వం, ఇంకా చాలా ఇంట్రస్టింగ్‌ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు.