LBF News

/ Sep 25, 2025

హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్‌

ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ హాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ప్రఖ్యాత బ్రిటిష్‌ నటుడు జెరెవిూ ఐరన్స్‌ సరసన నటిస్తున్నారు.వెటరన్‌ దర్శకుడు చంద్రన్‌ రత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శ్రీలంకలో చిత్రీకరించబడిరది. ‘రిజానా ` ఎ కేజ్‌డ్‌ బర్డ్‌’ అనే ఈ సినిమా ఒక నిజమైన కథ ఆధారంగా రూపొందించబడుతోంది.

ఈ ప్రాజెక్ట్‌ గురించి వరలక్ష్మి మాట్లాడుతూ.. ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్న జెరెవిూ ఐరన్స్‌ వంటి గొప్ప నటుడితో కలిసి పనిచేయడం నిజంగా ఒక కల నెరవేరినట్టు అనిపిస్తోంది. లయన్‌ కింగ్‌ సినిమాలో స్కార్‌ పాత్రకు ఆయనే వాయిస్‌ ఇచ్చారు. ఆ సినిమా నాకు ఇష్టం. అన్ని డైలాగులు నాపక్కా గుర్తుండిపోతాయంతగా చూసాను. ఇప్పుడా సినిమాకు వాయిస్‌ ఇచ్చిన ఆయనతో నేను నటించడం అనేది ఒక గొప్ప అవకాశం.

చంద్రన్‌ రత్నం గారి దర్శకత్వంలో పనిచేయడం కూడా నాకు గర్వకారణం. శ్రీలంకలోనే కాదు, ప్రపంచ సినిమాకే ఆయన కొత్త దారులు చూపిన దర్శకుడు. ఇలాంటి అద్భుతమైన అంతర్జాతీయ స్టార్స్‌తో కలిసి పనిచేసే అవకాశం నాకు దొరికినందుకు ఆనందంగా వుంది.ఇది నా కెరీర్‌లో మరిచిపోలేని ఒక మైలురాయి’అన్నారు.

రిజానా ` ఎ కేజ్‌డ్‌ బర్డ్‌ మూవీ దక్షిణాసియా, అంతర్జాతీయ సినిమా మధ్య ఒక హిస్టారికల్‌ కొలాబరేషన్‌ గా నిలవబోతోంది.