LBF News

/ Sep 26, 2025

సోదరభావంతో మొహర్రం వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి

. అవగాహన కల్పించిన జొన్నగిరి ఎస్సై మల్లికార్జున

తుగ్గలి : మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించు మొహర్రం పండుగ వేడుకలను ప్రజలందరూ సోదరభావంతో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జొన్నగిరి ఎస్‌ఐ ఎన్‌.సి మల్లికార్జున తెలియజేశారు.శుక్రవారం రోజున జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ ఐపీఎస్‌ ఆదేశాల మేరకు జొన్నగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గల పలు గ్రామాలలో పోలీస్‌ సిబ్బందితో కలసి జొన్నగిరి ఎస్‌ఐ మల్లికార్జున ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అత్యంత వైభవంగా జరిగే మొహర్రం వేడుకలలో ఎటువంటి అల్లర్లకు తావులేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన తెలియజేశారు.చిన్న సరిగెత్తి, పెద్ద సరిగెత్తి మరియు మొహర్రం ముగింపు కార్యక్రమాలలో ప్రజలందరూ పోలీస్‌ అధికారులకు సహకరించి శాంతియుతంగా నిర్వహించాలని ఆయన తెలియజేశారు.శాంతి భద్రతలకు వివాదం కలిగించి పండుగ వాతావరణంలో అల్లర్లు సృష్టిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు గ్రామాలలో ముందస్తుగా అవగాహన కల్పిస్తున్నట్లు జొన్నగిరి ఎస్సై ఎన్‌.సి మల్లికార్జున తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జొన్నగిరి పోలీస్‌ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.