LBF News

/ Sep 27, 2025

సుపరిపాలనలో తొలి అడుగు

. ఇంటింటికీ టీడీపీకార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యేలు

చిత్తూరు : సుపరిపాలనలో తొలి అడుగును,  బుధవారం చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని ఒకటవ వార్డు, యం.అగ్రహారంలో ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని  చిత్తూరు పార్లమెంటు సభ్యులు  దగ్గుమళ్ళ ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే  గురజాల జగన్‌ మోహన్‌ ప్రారంభించారు. ముందుగా దొడ్డి పల్లెలోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు.

ఇంటింటికీ టిడిపి కార్యక్రమంలో భాగంగా యం.అగ్రహారంలోని ప్రతి గడప కెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ప్రజలకందిస్తూ.. ప్రజలతో ఆప్యాయంగా పలకరిస్తూ.., కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజానికానికి వివరించారు  ఎంపీ, ఎమ్మెల్యేలు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు,  డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ బాబు రి నేతృత్వంలో.. ఆంధ్రప్రదేశ్‌ ప్రగతి పథం వైపు పయనిస్తుందని ఎంపి, ఎమ్మెల్యే అన్నారు. అర్హులైన ప్రతిఒక్కరికీ సూపర్‌ సిక్స్‌ పథకాలను చేరువచేస్తున్నాం, పేదలు లేని సమాజ స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంటు టిడిపి జిల్లా అధ్యక్షుడు  సి.ఆర్‌.రాజన్‌, రు,, మాజీ ఎమ్మెల్సీ  దొరబాబు,  నగర కార్పొరేషన్‌ మేయర్‌ కుమారి అముద,  చూడా ఛైర్పర్సన్‌ కఠారి హేమలత,  టీడీపీ సీనియర్‌ నేత కాజూరి బాలాజీ, తదితరులు పాల్గోన్నారు.