LBF News

/ Sep 24, 2025

సామాజిక సేవలో లయన్స్‌ క్లబ్‌ ముందు

కోరుట్ల : సామాజిక సేవలో లయన్స్‌ క్లబ్‌ ముందు వరుసలో నిలుస్తుందని పలువురు కొనియాడారు.లయన్స్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా 320 జీ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు కోరుట్ల లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని ఆదర్శనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.  పాఠశాల విద్యార్థులకు నోట్‌ పుస్తకాలు, పెన్నులు,పలుకలు, బలుపాలు, విద్యా సామాగ్రిని పంపిణీ చేసి విద్యాభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడిరచారు. పర్యావరణ పరిరక్షణ కోసం  జాతీయ రహదారి పక్కన మొక్కలు నాటే కార్యక్రమాన్ని  చేపట్టారు. లయన్స్‌ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు  మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు పరిపూర్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్షులు కొమ్ముల జీవన్‌ రెడ్డి, కార్యదర్శి ఏలేటి లక్ష్మారెడ్డి, కోశాధికారి నల్ల గంగాధర్‌, లయన్స్‌ సభ్యులు గుంటుక సురేష్‌ బాబు, అజయేంధర్‌ రావు, ఆడెపు మధు,మంచాల జగన్‌, వనపర్తి చంద్రం, గుంటుక మహేష్‌, గుణాకర్‌ రెడ్డి, పడాల నారాయణ గౌడ్‌, గాజంగి నాగ భూషణ్‌, వేంకట్రాములు, కల్లెం గంగా రెడ్డి, బెజ్జంకి శ్రీనివాస్‌ రావు, కె. రాజేంద్రప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.