LBF News

/ Sep 27, 2025

సంక్షేమ పథకాలే ఆయుధంగా రేవంత్‌ సర్కార్‌ దూకుడు..!

హైదరాబాద్‌ : త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా ఫలితాలను సాధించేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం వ్యూహాలను రచిస్తోంది. ఇప్పటికే అమలవుతున్న సంక్షేమ పథకాలతో పాటు కొత్తగా మరికొన్నింటిని అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రజలకు ఇచ్చిన హావిూలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ఎన్నికలకు ముందు పథకాలను అమలు చేయడంతో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే దిశగా కసరత్తు చేస్తోంది.