. యం ఇ ఎఫ్ నాయకులు భాస్కర్
కౌతాళం : సమాజంలో దళితులు పై వివక్ష లేని సమాజ స్ధాపనే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి లక్ష్యం అని మాదిగ ఎంప్లాయి ఫెడరేషన్ నాయకులు ఆరేకంటి భాస్కర్, మంత్రాలయం నియోజకవర్గం యం ఆర్ పి యస్ ఇన్ చార్జి బండారి హనుమంతు అన్నారు వారు కౌతాళం మండలం బదినేహాల్,ఏరిగేరి,బాపురం,లింగలదిన్ని, గ్రామాలలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యం ఆర్ పి యస్ జెండా ఆవిష్కరణ చేశారు యం ఆర్ పి యస్ సీనియర్ నాయకులు సల్మాన్ రాజు అధ్వర్యంలో మండల అధ్యక్షులు గుడికంభాలి ఆనంద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన యం ఇ ఎఫ్ నాయకులు భాస్కర్, నియోజకవర్గం ఇన్చార్జి బండారి హనుమంతు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాలు అనేక పోరాటాలు చేసి ఎ బి సి డి వర్గీకరణ సాధించింది అని బడుగు బలహీన వర్గాల కోసం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పని చేస్తూంది అని వారు అన్నారు అనంతరం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు శ్రీ పద్మశ్రీ మందా క్రిష్ణ మాదిగ జన్మదిన సందర్భంగా కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యం ఆర్ పి యస్ జిల్లా నాయకులు రాజు,యం యస్ పి మండల అధ్యక్షులు శంకర్,బదినేహాల్ చిన్న,వీరేష్, రమేష్,యం ఆర్ పి యస్ మండల ఉపాధ్యక్షులు ఏరిగేరి విరేష్,ప్రదాన కార్యదర్శి రామాంజనేయులు, బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ విజయ్ కుమార్, ఆనంద్,శివ,లింగలదిన్ని నాగరాజు, సంపత్,బాపురం నాయకులు తదితరులు పాల్గొన్నారు.