LBF News

/ Sep 26, 2025

వినాయకసాగర్‌ లో పెండిరగ్‌ పనులు త్వరగా పూర్తి చేయండి

కమిషనర్‌ ఎన్‌.మౌర్య

వినాయక సాగర్‌ అభివృద్ధి పనుల్లో పెండిరగ్‌ లో ఉన్న వాటిని త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ ఎన్‌.మౌర్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం  వినాయక సాగర్‌ను, కొర్లగుంట వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనులను అధికారులతో కలసి కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ వినాయక సాగర్‌లో స్విమ్మింగ్‌ పూల్‌, గ్లో గార్డెన్‌ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సాగర్‌ వాకింగ్‌ ట్రాక్‌ నందు పెరిగిన మొక్కలు కత్తిరించి వాకర్స్‌ కు ఇబ్బంది లేకుండా చేయాలని అన్నారు. అక్కడ ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో మొక్కలు నాటాలని అన్నారు. సాగర్‌ ను పరిశుభ్రంగా ఉంచి, ప్రజలకు ఆహ్లాదం కలిగించేలా ఏర్పాటు చేయాలని అన్నారు. కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణాన్ని పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్‌ వెంట సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ శ్యాంసుందర్‌, స్మార్ట్‌ సిటీ ఈ.ఈ.రవి, డి.ఈ. రమణ, రాజు, వెంకట ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.