LBF News

/ Sep 24, 2025

వన మహోత్సవాన్ని విజయవంతం చేయండి

. జిల్లా కలెక్టర్‌ బి. సత్య ప్రసాద్‌

జగిత్యాల : వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ బి. సత్య ప్రసాద్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు జిల్లా సహకార శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఏక్‌ పెడ్‌  మా కే నామ్‌ ‘ (మన తల్లి పేరిట ఒక మొక్క నాటుదాం) కార్యక్రమాన్ని జగిత్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో  కలెక్టర్‌ ప్రారంభించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం 2025 ను పురస్కరించుకొని జిల్లాలోని అన్ని సహకార సంఘాల పరిధిలో  శుక్రవారం నాడు పెద్ద సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల పాక్స్‌ లో ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ మొక్కలు నాటి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ భాగస్వామ్యం కావడం ప్రశంసనీయం అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా సహకార అధికారి సి .హెచ్‌. మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో ఒకే రోజు 2500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. సహకార సంఘాల పరిధి లోని అన్ని కార్యాలయాలు, గోదాముల పరిధి లో ఉన్న ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొక్కల సంరక్షణ ను జియో ట్యాగింగ్‌ ద్వారా పరివేక్షిస్తామన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌, జిల్లా వ్యవసాయ అధికారి వి. భాస్కర్‌, అర్బన్‌ తహశీల్దార్‌ రామ్‌ మోహన్‌,ప్యాక్‌ జగిత్యాల అధ్యక్షుడు పత్తి మహిపాల్‌ రెడ్డి, కల్లెడ పాక్స్‌ చైర్మన్‌ సందీప్‌ రావు సహకార శాఖ అధికారులు సాయి కుమార్‌, సుజాత  జగిత్యాల పీఏసీఎస్‌ కార్యదర్శి వేణు జగిత్యాల అర్బన్‌ మండల వ్యవసాయ అధికారి వినీల తదితరులు పాల్గొన్నారు.