కరీంనగర్ : వన మహోత్సవంలో భాగంగా వాకింగ్ ట్రాక్ వద్ద 2 వేలకు పైగా మొక్కలు మహిళలు నాటారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి , ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి,కలెక్టర్ పమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గోన్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో మొక్కలు నాటి వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మన ప్రాంతమంతా పచ్చదనం తో కాలుష్య రహితంగా మంచి వాతావరణంలో ఉండాలంటే మొక్కలు నాటాలి. మనం పిల్లలని పెంచుకునే విధంగా మొక్కలను పెంచుకోవాలి. బర్త్ డే లకు, పెళ్లి రోజులకు, ప్రత్యేక రోజులకు మొక్కలు నాటాలి. ఒక మొక్కను నాటి దానిని పెంచడం ఒక బాధ్యత గా పిల్లలని పెంచినట్టు పెంచాలి. దేశ రాజధాని ఢల్లీిలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యంతో అక్కడ ఉండే పరిస్థితి లేదని అన్నారు.
తెలంగాణ లో కాలుష్య రహితంగా ఉండాలని ప్రభుత్వాలు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మొక్కలు నాటడానికి వన మహోత్సవం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో వార్డు లో ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించాలి జిల్లాలో ప్రతి గ్రామంలో మొక్కలు నాటాలి అందరూ సామాజిక బాధ్యతగా తీసుకొని అందరూ పాల్గొనాలి. రాజకీయ నాయకులు, అధికారులు, మహిళా సంఘాలు మొక్కలు నాటాలి. మొక్కలు నాటేల అధికారులు విద్యార్థులకు ప్రజలకు అవగాహన కల్పించాని అన్నారు.