ముంబయిః ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 సందర్భంగా ఆవిష్కరించబడిన కోకా-కోలా ఇండియా రీసైకిల్డ్ పీఈటీ (పెట్) ఇండియా జెండా, ప్రతిష్టాత్మక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ 2025లో ‘అతిపెద్ద జెండా – రీసైకిల్డ్ మెటీరియల్’ వర్గం కింద స్థానం సంపాదించింది. రీసైకిల్డ్ పదార్థాల వినూత్న వినియోగం ద్వారా స్థిరమైన మార్పును నడిపించడానికి బ్రాండ్ చేస్తున్న ప్రయత్నాలను ఇది హైలైట్ చేస్తుంది. మైదాన్ సాఫ్ ప్రచారంలో భాగంగా ప్రవేశపెట్టబడిన ఈ జెండా, పోస్ట్-కన్స్యూమర్ పెట్ బాటిళ్ల నుండి తయారయింది. భారతదేశం ఆడే ప్రతి ప్రపంచ కప్ మ్యాచ్‌లో ప్రారంభోత్సవ వేడుకలో ప్రదర్శించారు. 2023 అక్టోబర్ 5 నుండి నవంబర్ 19 వరకు 10 స్టేడియంలలో జరిగిన ఈ టోర్నమెంట్లో 1,000 మందికి పైగా వాలంటీర్లు పెట్ బాటిళ్లతో తయారు చేసిన సేఫ్టీ జాకెట్లు ధరించి, ప్రేక్షకులను సరైన వ్యర్థాల విభజనపై చురుకుగా నిమగ్నం చేస్తూ, స్టేడియంలు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం, అవగాహన చర్యలు చేపట్టడంపై అవగాహన కల్పించారు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కోకా-కోలా రీసైకిల్డ్ ఇండియా జెండా
