LBF News

/ Sep 27, 2025

యోగాంధ్రను విజయవంతం చేద్దాం

విశాఖపట్నం : యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం పై టీడీపీ కార్యాలయంలో మంత్రుల సవిూక్ష జరిగింది.  మంత్రులు నారాయణ,బాల వీరాంజనేయ స్వామి,అనిత,అనగాని,సత్యకుమార్‌,పార్థసారథి, సవిత,బీసీ జనార్దన్‌ రెడ్డి హజరయ్యారు. యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది.  తెల్లవారుజామున జరిగే కార్యక్రమం కావడంతో దూరప్రాంతాల నుంచి వచ్చే వారికోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై  మంత్రులు మంత్రులు చర్చించారు. జనసవిూకరణ,రవాణా,ఇతర సౌకర్యాలపై ప్రజాప్రతినిధులు, కూటమి నేతలకు మంత్రులు దిశానిర్దేశం చేసారు.

మంత్రి నారాయణ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ఉదయం 6.25 కి స్టార్ట్‌ అవుతుంది. కార్యక్రమంలో పాల్గొనే వారంతా తెల్లవారుజామున 5 గంటలకల్లా వచ్చేలా చూడాలి. ప్రధాని హాజరయ్యే కార్యక్రమం కావడం తో భద్రతా రీత్యా ఉదయం 5.30 తర్వాత ఎవరినీ అనుమతించరు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వసతుల కల్పిస్తున్నాం. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని అన్నారు.