LBF News

/ Sep 26, 2025

యుద్ధం తీవ్రరూపం

బాంబులతో విరుచుకుపడిన ఇరాన్‌

తెహ్రాన్‌  :  ఇరాన్‌, ఇజ్రాయిల్‌  మధ్య యుద్ధం తీవ్రతరమవుతోంది.  రెండు దేశాలు పరస్పరం భీకర దాడులకు పాల్పడుతున్నాయి. ఇజ్రాయిల్‌ కీలక సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణులతో దాడిచేస్తుంది. ఇజ్రాయిల్‌కు ఎక్కువగా నష్టం సంభవించింది.  ఇజ్రాయిల్‌ సైతం వెనక్కి తగ్గడం లేదు.   ఇజ్రాయిల్‌కు సంబంధించిన ఏ లక్ష్యాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఎలాంటి పరిమితులు పెట్టుకోబోమని ఇరాన్‌ ప్రకటించింది. ఇజ్రాయిల్‌పై మరిన్ని దాడులు చేస్తామని హామీ ఇస్తున్నా అంటూ ఇరాన్‌ సాయుధ దళాల చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ చైర్మన్‌ మేజర్‌ జనరల్‌ అబ్దుల్‌రహీం మౌసవీ ఒక ప్రకటన చేశారు.  ప్రపంచ దేశాలు విన్నవిస్తున్నప్పటికీ ఆ రెండు దేశాలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ కార్ప్సొ ఏరోస్పేస్‌ స్థావరాల సంద్శన సమయంలో యుద్ధ సన్నద్ధతను ప్రశంసిస్తూ, సైనికుల నిబద్ధతను మెచ్చుకున్నారు. వారి మనోధైర్యాన్ని పెంచారు. ఇజ్రాయిల్‌ లక్ష్యాలను ధ్వంసం చేస్తున్న ఏరోస్పేస్‌ దళాన్ని అభినందించారు.  కొత్త ‘సెజ్జిల్‌’ రకానికి చెందిన శక్తిమంతమైన క్షిపణులతో ఇజ్రాయిల్‌పై ఇరాన్‌ ఏడవ రోజు భీకర దాడులు కొనసాగించింది. టెల్‌ అవీవ్‌, జెరూసలేం దద్దరిల్లిపోయాయి. బాలిస్టిక్‌ క్షిపణులతో టెల్‌ అవీవ్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రాలు, స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ భవనంపై విరుచుకుపడిరది. ఈ పేలుళ్ల ధాటికి అక్కడి పెద్ద ఆసుపత్రి సొరోక మెడికల్‌ సెంటర్‌కు తీవ్ర నష్టం జరిగింది. 40 మందికి గాయాలయ్యాయి. ఈ ఆసుపత్రిపై ఇరాన్‌ నేరుగా దాడి చేసినట్లు తొలుత వార్తలు వచ్చాయి కానీ ఇరాన్‌ లక్ష్యం ఇంటెలిజెన్స్‌ కేంద్రాలేగానీ ఆసుపత్రి కాదని అధికారిక మీడియా పేర్కొంది. అమెరికా జోక్యంతో యుద్ధం విస్తృతమవుతుందని ఇరాన్‌ మరోమారు హెచ్చరించింది. జియోనిస్ట్‌ పాలనకు మద్దతిస్తే తమ దేశాన్ని, జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం అమెరికా, ఇజ్రాయిల్‌కు బుద్ధి చెప్పేందుకు ఇరాన్‌ తన అస్త్రాలు బయటకు తీయాల్సివస్తుందని ఇరాన్‌ విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఖాజెమ్‌ ఘరీబాబాదీ వెల్లడిరచారు. సైనికపరమైన నిర్ణయాధికారులు ఇప్పటికే తమకున్న అన్ని అవకాశాలపై అవగాహనకు వచ్చినట్లు తెలిపారు. గురువారం ఇజ్రాయిల్‌ సైన్యానికి చెందిన సీ 41 టెలీకమ్యూనికేషన్స్‌ కార్ప్సొ కేంద్ర కార్యాలయాలు, ఇంటెలెజిన్స్‌ కేంద్రం ‘ఐఆర్‌ఎన్‌ఏ’పై ఇరాన్‌ క్షిపణులతో విరుచుకుపడిరదని, పేలుళ్ల ధాటికి ఆసుపత్రికి నష్టం జరిగినట్లు వార్తా నివేదికలు పేర్కొన్నాయి. బీర్షెబాలోని సొరోక మెడికల్‌ సెంటర్‌పై ఇరాన్‌ క్షిపణి దాడితో తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఇజ్రాయిల్‌ అధికారులు పేర్కొన్నారు. కిటికీల అద్దాలు ధ్వంసం కావడం, ఆ ప్రాంతాన్ని నల్లటి పొగమంచు కమ్మేయడం వంటి దృశ్యాలను ఇజ్రాయిల్‌ మీడియా ప్రసారం చేసింది. ఇరాన్‌లోని అరక్‌ హెవీ వాటర్‌ ఫెసిలిటీపై ఇజ్రాయిల్‌ దాడి చేసింది. దాడికి ముందే ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. దీంతో లీకేజి ముప్పు లేదు. నటాన్జ్‌ ప్రాంతంలోని అణ్వస్త్రాల తయారీ కేంద్రంపైనా వైమానిక దాడులు జరిపింది. 40 ఇజ్రాయిల్‌ యుద్ధ విమానాలు ఇరాన్‌లోని డజన్ల కొద్ది లక్ష్యాలపై దాడులు చేసినట్లు సైన్యం తెలిపింది.