LBF News

/ Sep 25, 2025

మెట్రో ట్రైన్స్‌లో కొనికా మినోల్టా బ్రాండిరగ్‌ క్యాంపెయినింగ్‌

హైదరాబాద్‌: డిజిటల్‌ ప్రొడక్షన్‌ ప్రింటింగ్‌ వ్యాపారంలో దిగ్గజంగా నిలుస్తోన్న కొనికా మినోల్టా బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఇండియా ప్రైవేట్‌  లిమిటెడ్‌ సంస్థ దేశవ్యాప్తంగా బ్రాండ్‌ మార్కెటింగ్‌ చేసేందుకు మరోసారి ముందుకొచ్చింది. మెట్రో రైళ్లలో క్యాంపెయినింగ్‌ చేసేందుకు నిర్ణయించుకుంది. ఈ మేరకు దిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, కలకత్తా వంటి ఆరు నగరాలను ఎంచుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో దిల్లీ, ముంబయిలో జరిపిన క్యాంపెయిన్‌ విజయవంతం అయినందున రెండో సారి తమ బ్రాండ్‌ మార్కెటింగ్‌ చేసేందుకు సిద్ధమైంది. తాము ఎంచుకున్న ఆరు సిటీల్లోని 7 మెట్రో రైళ్లను ఈ క్యాంపెయిన్‌ లో భాగం చేయనుంది. జూన్‌ 23న దిల్లీ, ముంబయిలో రెండో దఫా క్యాంపెయిన్‌ ప్రారంభించి మిగతా నగరాల్లో కొనసాగించనుంది. ‘కలిసికట్టుగా, కొత్త అడుగులు వేస్తూ’, ‘ఇండియా ప్రింట్స్‌ ఆన్‌ కొనికా మినోల్టా’ వంటి క్యాంపెయిన్‌ సారాంశంతో మెట్రో రైళ్ల లోపల, వెలుపల బ్రాండిరగ్‌ చేయనున్నారు.