కడప (బ్రహ్మంగారిమఠం) : తాళ్లపల్లి సవిూపంలో రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడిన శివానందరెడ్డికి 50 వేలు ఆర్థిక సాయం నారాయణ స్కూల్ కరస్పాండెంట్ కొట్టే.నారాయణరెడ్డిఅందజేసి తన గొప్ప తనాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి వేంపల్లి మండలం తాళ్లపల్లి సవిూపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని బాసం గంగరాజు మృతి చెందగా బైక్ పై ఉన్న మరో వ్యక్తి శివానందరెడ్డి కి తీవ్ర గాయాలు కావడంతో కడపలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.ఈ విషయం తెలుసుకున్న వేఃపల్లెలో ఉన్న నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ నారాయణరెడ్డి మంచి మనసుతో స్పందించి శివానందరెడ్డి తల్లి రవణమ్మ ను పిలిపించి తన కుమారుని వైద్యం ఖర్చులకు గాను తనవంతుగా 50 వేల రూపాయలు నగదును ఆమెకు అందించారు. అలాగే అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు గురు సుబ్బమ్మ 10000 రూ, సంస్థలో పనిచేస్తున్న ఉపాధ్యాయుని, ఉపాధ్యాయురాలు మరో 30 వేలు జమ చేసి శివానందరెడ్డి తల్లికి సుమారుగా లక్ష రూపాయల వరకు అందజేశారు. గతంలో శివానందరెడ్డి నారాయణ పాఠశాలలో పి ఈ టి మాస్టర్ గా పనిచేశారని ఆయన అందించిన సేవలను గుర్తించి త్వరగా కోలుకోవాలని కరస్పాండెంట్ నారాయణరెడ్డి మరియు కోటిరెడ్డి, అధ్యాపక సిబ్బంది ఆకాంక్షించారు. వేంపల్లి లో ఉన్న నారాయణ పాఠశాల యాజమాన్యంతో పాటు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయ స్పందించి ఈ విధంగా ఆర్థిక సహాయాన్ని అందజేయడం పట్ల పట్టణంలోని పలువురు ప్రజలు మేధావులు వారిని వారి సిబ్బందిని అభినందిస్తున్నారు.
మానవత్వం చాటుకున్న నారాయణ స్కూల్ అధినేత నారాయణరెడ్డి
