. ఘన నివాళి అర్పించిన పోలీస్ కవిూషనర్ గౌష్ ఆలం
కరీంనగర్ : మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కవిూషనరేట్లో ఘనంగా నివాళులర్పించారు. కవిూషనర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ పోలీస్ కవిూషనర్ గౌష్ ఆలం రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా పోలీస్ కవిూషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ. రోశయ్య సుదీర్ఘకాలం పాటు ప్రజాసేవలో నిమగ్నమై చేసిన దేశసేవ, పరిపాలనా పటిమ, నిష్కళంక రాజకీయ జీవితాన్ని కొనియాడారు. రాజకీయాల్లో ఉన్నతమైన నైతిక విలువలకు ఆయన నిలయంగా నిలిచారని, ప్రజల పట్ల ఆయన సేవాతత్వం ప్రతి అధికారికి ప్రేరణగా నిలవాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏఆర్ భీంరావు, రిజర్వు ఇన్స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, సీపీఓ అధికారులు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.