LBF News

/ Sep 27, 2025

మహిళల భద్రతపై  అవగాహన కార్యక్రమం

ఏలూరు : మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం ఎంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టి ప్రత్యేకంగా శక్తి టీంను ఏర్పాటు చేసిందని ,శక్తి టీం ఇన్చార్జి సీఐ సుబ్బారావు అన్నారు .ఏలూరు లోని సత్రంపాడు ప్రాంతంలో ఉన్న సాయి శ్రీ పారామెడికల్‌ కళాశాలలో మంగళవారం మహిళల భద్రతపై  అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.  సిఐ సుబ్బారావు శక్తి యాప్‌ గురించిన విషయాలపై పారా మెడికల్‌ విద్యార్థినులకు అవగాహన కల్పించారు.