LBF News

/ Sep 24, 2025

మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శం

. జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌

జగిత్యాల : మహనీయుల జీవితం మనందరికీ ఆదర్శమని జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ ఆన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌ సవిూకృత జిల్లా కలెక్టరేట్‌ లోని సమావేశం మందిరంలో నిర్వహించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజెటి రోశయ్య జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ కొణిజెటి రోశయ్య చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ సత్యప్రసాద్‌  మాట్లాడుతూకొణిజేటి రోశయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రిగా 16 సార్లు బడ్జెట్‌ ప్రవేశ పెట్టారని,  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మర్రి చెన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి నేదురుమల్లి జనార్దన్‌ రెడ్డి వైయస్సార్‌ హయాంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారని, ఆర్థిక శాఖ తోపాటు రోడ్లు భవనాలు రవాణా శాఖ మంత్రిగా హౌసింగ్‌ శాఖ మంత్రిగా విద్యుత్‌ శాఖ మంత్రిగా హోమ్‌ మినిస్టర్‌ వైద్య ఆరోగ్యం, విద్యాశాఖ మంత్రిగా కూడా కొంతకాలం తన సేవలు అందించారని, వైయస్సార్‌ హఠాన్మరణం తర్వాత ముఖ్యమంత్రిగా  కొంత కాలం సేవలు అందించారని, అనంతరం తమిళనాడు గవర్నర్‌ గా పని చేసారని తెలిపారు.మహనీయులను ఒక కులానికో, ఒక వర్గానికో పరిమితం చేయకుండా ఆయన ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ బిఎస్‌ లత.బీసీ సంక్షేమ అధికారి జి సునీత , జిల్లా  యువజన క్రీడ శాఖ అధికారి రవి, పిడి డిఆర్డీఏ రఘువరన్‌, ఇతర జిల్లా అధికారులు, కలెక్టరెట్‌ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. Iమాజీ ముఖ్యమంత్రి రోశయ్య కు ఘన నివాళి అర్పించిన జిల్లా ఎస్పీ  అశోక్‌ కుమార్‌ Iఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య  జయంతి సందర్భంగా జిల్లా పోలీస్‌ ప్రదాన  కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రోశయ్య చిత్రపటానికి ఎస్పీ అశోక్‌ కుమార్‌ పూలమాలవేసి నివాళులర్పించారు.ఆనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో  ముఖ్య మంత్రిగా,ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు ఆర్థిక మంత్రి హోదాలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య దక్కించుకున్నారని తెలిపారు. ఆయన ప్రజాసేవా నిబద్ధత, పరిపాలనలో సాధించిన విజయాలను గుర్తు చేసుకుంటూ పోలీస్‌ సిబ్బంది ఆయన జీవితం నుండి ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రిజర్వ్‌ ఇన్స్పెక్టర్లు కిరణ్‌ కుమార్‌,వేణు, ఐటీ కోర్‌ ఇన్స్పెక్టర్‌ రఫీక్‌ ఖాన్‌, ఫింగర్‌ ప్రింట్‌ ఇన్స్పెక్టర్‌  శ్రీధర్‌, పోలీస్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.