హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని… తన కార్యక్రమాలకు బీఆర్ఎస్ సపోర్టు ఉంటుందని కామెంట్ చేశారు. రైల్‌రోకో పోస్టర్ రిలీజ్ సందర్భంగా విూడియా అడిగిన ప్రశ్నలకు ఇలా స్పందించారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 17న జాగృతి ఆధ్వర్యంలో రైల్‌రోకోకు కవిత పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారామె. చేపట్టబోయే రైల్ రోకోను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీసీ బిల్లు సాధించేందుకు జులై 17 తారీఖున రైల్ రోకోలో అన్ని పార్టీలు పాల్గొనాలని కె. కవి పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని పార్టీల మద్దతు కూడ గట్టామన్నారు. జూలై 17న తెలంగాణ నుంచి ఢల్లీి వెళ్ళే ప్రతి రైలును ఆపి నిరసన కార్యక్రమం విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించుకునేందుకు బిజెపిపై ఒత్తిడి తెస్తామన్నారు. రైల్ రోకో కార్యక్రమానికి బిఆర్ఎస్ మద్దతు ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం ఇచ్చారు. తాను బిఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. రైల్ రోకోకు కచ్చితంగా బీఆర్ఎస్ సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలనే ఢల్లీి నుంచి ంఎఅఅ అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే సహా ఇతర కీలక నేతలు వస్తున్నారని కవిత ఆరోపించారు. బిసిలకు ఇచ్చిన హావిూలు అమలు చెయ్యకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. మల్లి ఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్లో ఎప్పుడూ మాట్లాడిరది లేదని ఆరోపించారు. బిసిలకు 42 రిజర్వేషన్ అమలు అయ్యేలా బిజెపిపై మల్లిఖార్జున్ ఖర్గే ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కులగణన వివరాలు బయట పెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కవిత. ఇంకా పాత లెక్కలే చెప్తున్నారని, గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలని అన్నారు. లేకుంటే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. బీసీ బిల్లుపై బిజెపి కొత్త అధ్యక్షుడు చొరవ తీసుకోవాలని సూచించారు కవిత. ఈమేరకు రామచందర్ రావుకు లెటర్ రాశామని తెలిపారు. ఆ వివరాలను కూడా ఆమె పంచుకున్నారు. ఆయన చొరవ తీసుకొని బిజెపి అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని సూచించారు.
బీఆర్ఎస్ మద్దతుతోనే రైల్ రోకొ
