విశాలాంధ్ర/వరంగల్: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ తెలంగాణ నివాసుల నిర్దిష్ట ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడానికి శ్రద్ధతో రూపొందించబడిన ‘మీ కోసం’ అనే ఒక సరికొత్త హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ను ప్రవేశపెట్టింది. ‘మీ కోసం’ అనేది కేవలం ఒక హెల్త్ ప్లాన్ మాత్రమే కాదు, తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడిన కవరేజ్తో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను రాష్ట్ర ప్రజలకు అందుబాటులో తీసుకురావడానికి చూపే నిబద్ధత. ప్రాంతాల వారీగా ఆరోగ్య సంరక్షణ సవాళ్లు, ఖర్చులు, అందుబాటులో ఉండే చికిత్స మారుతుంటాయి అని అర్థం చేసుకున్న బజాజ్ అలియంజ్, అందరికీ ఒకే రకమైన పరిష్కారం అందించడానికి బదులుగా వ్యక్తిగతీకరించిన కవరేజ్ అందించడానికి ‘మీ కోసం’ ను రూపొందించింది.
బజాజ్ అలియంజ్ ‘మీ కోసం’తో తెలంగాణలో హెల్త్ ఇన్సూరెన్స్
