LBF News

/ Sep 25, 2025

ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలి

సిద్దిపేట :  ప్రజావాణి ఆర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ కే. హైమావతి అధికారులను ఆదేశించారు సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఐడిఓసి లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు లోకల్‌ బాడీస్‌ గరిమా అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ రెవిన్యూ అబ్దుల్‌ హవిూద్‌ లతో కలిసి ప్రజలండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమానికి  152 అర్జీలు వచ్చినాయి.  అంతకుముందు జిల్లా అధికారులతో నిర్వహించిన రివ్యూలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ  ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మండల ప్రత్యేక అధికారులు మండలంలో పర్యటించి సానిటేషన్‌, ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి, వనమహోత్సవం సహ అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాల ప్రగతిని పర్యవేక్షించాలని అన్నారు. ప్రజావాణి ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిశీలించి శనివారంలోగా దరఖాస్తులను పరిష్కరించి ఆన్లైన్లో పొందుపరచాలని అన్నారు.  ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ నాగరాజమ్మ,  కలెక్టరేట్‌ ఏవో, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.