LBF News

/ Sep 24, 2025

పెద్ద రైల్వే స్టేషన్‌ లో పోలీసుల స్పెషల్‌ డ్రైవ్‌

ఏలూరు : గురువారం ఉదయం ఏలూరు నగరంలోని పెద్ద రైల్వే స్టేషన్‌ లో పోలీసులు  స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  ఈగల్‌ టీం ఐజి రవికృష్ణ  ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ ఈగల్‌ టీం ఈగల్‌ టీం ఎస్పీ నాగేశ్వరరావు ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్క సూర్యచంద్రరావు ఏలూరు డిఎస్పి శ్రావణ్‌ కుమార్‌ ఆర్పిఎఫ్‌ జి ఆర్‌ పి పోలీసులు పాల్గోన్నారు.   కోరమండల్‌ ఎక్స్ప్రెస్‌ రైలులో ఆపరేషన్‌ విజయ పేరుతో విస్తృత తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఈగల్‌ టీం ఐజి రవి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈగల్‌ టీం ప్రారంభించిన అప్పటినుండి ఇప్పటివరకు 21736 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు ఏజెన్సీ ప్రాంతమైన అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించామని  డ్రోన్‌ సహాయంతో సాగు చేస్తున్న పంటను గుర్తించి వాటిని నాశనం చేస్తున్నామని తెలియజేశారు స్థానికంగా ఉన్న ప్రజలకు గంజాయి సాగు నేరమని వాటిని చేస్తే చట్టపరమైన కఠిన చర్య తీసుకుంటామనిఇప్పటికే అవగాహన కల్పిస్తున్నామని కొందరిపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు ఈగల్‌ టీం 370 గ్రామాలపై ప్రత్యేకంగ ఉంచిందని  వారిలో అనుమతులుగా ఉన్న 359 మందిపై కూడా నిఘా పెట్టిందని ఆయన అన్నారు. ఇక్కడ ఉన్న వీరికి ప్రత్యామ్నాయ పంటలు పెంచుకునేందుకుగాను విత్తనాల సరఫరాను కూడా ప్రభుత్వమే చేస్తుందని ప్రభుత్వం తరఫున ఈగల్‌ టీం చేస్తుందని తెలిపారు.  ఈగల్‌ టీం ముఖ్య ఉద్దేశం మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దటమేనని అందుకు కావలసిన అడుగులను ఈ విభాగం వేస్తుందని ఆయన స్పష్టం చేశారు. డ్రోన్ల సహాయంతో పోలీసింగ్‌ నిర్వహించడంతో కొంత ఈ సాగు చేసేవారిలో పూర్తిస్థాయి భయం ఏర్పడిరదని ఆయన తెలిపారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి పంటను పూర్తిగా ధ్వంసం చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోకి ఒరిస్సా నుండి చిన్నచిన్న మొత్తాలలో గంజాయిని సరఫరా చేస్తున్నట్లు తాము గుర్తించామని వీటిని నిర్మూలించేందుకే రైళ్లల్లో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని ఆయన మరో మారు స్పష్టం చేశారు. గంజాయి అక్రమ రవాణా వాటి నిర్మూలనకు ప్రభుత్వం ప్రత్యేకంగా టోల్‌ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేసిందని ఎవరైనా అనుమానితులు ఉన్న అనుమానం వచ్చిన వెంటనే 1972 నెంబర్‌ కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అలాగే ఈగల్‌ టీం ఇంకొంచెం ముందడుగు వేసి గంజాయి అక్రమ రవాణా దారుల ఆస్తులను సైతం జప్తు చేస్తుందని ఈ ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుందని కొంతమంది ఆస్తులు ఎప్పటికి జప్తు చేశామని కూడా ఆయన తెలిపారు ఎన్‌ డి పి ఎస్‌ యాక్ట్‌ చాప్టర్‌ 5 ప్రకారం ఈ కేసులో నమోదు చేస్తున్నామని మరో పదహారు మంది పై కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన తెలిపారు. ఇక వలస కూలీల విషయానికి వస్తే కొందరు వలస కూలీలు వచ్చి వెళ్లే సమయాలలో వారు పనిచేసే యజమానులు వారి సామాగ్రిని తరచుగా తనిఖీ చేస్తూ ఉండాలని ఏమాత్రం అనుమానం వచ్చిన వెంటనే 1972 నెంబర్‌ కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రతాప్‌ శివ కిషోర్‌ మాట్లాడుతూ ఆపరేషన్‌ విజయలో భాగంగా ఈగల్‌ టీం ఏలూరు జిల్లా పోలీసులు జి ఆర్‌ పి ఆర్‌ పి ఎఫ్‌ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించామని తెలియజేశారు. ఏలూరు జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా చేసేందుకు తాము పూర్తిగా కృషి చేస్తున్నామని ఆయన తెలియజేశారు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అనేక పద్ధతులలో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని కూడా ఆయన తెలిపారు. ఏలూరు జిల్లాలో ఇప్పటివరకు 20 కేసులు నమోదు చేశామని వాటిలో 700 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 45 మందిని అరెస్టు చేసి 11 ద్విచక్ర వాహనాలను సీజ్‌ చేశామని తెలిపారు. ఎవరిపైన నా అనుమానం ఉంటే వెంటనే 112 నెంబర్‌ కు సమాచారం ఇవ్వాలని సూచించారు వారి వివరాలను గోపిక ఉంచుతామని కూడా ఆయన తెలిపారు.  విద్యార్థులకు గంజాయిని సరఫరా చేసే వ్యక్తుల వివరాలు తెలిసినట్లయితే తల్లిదండ్రులు వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని కూడా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెండో పట్టణ సీఐ అశోక్‌ కుమార్‌ మూడో పట్టణ సిఐ కోటేశ్వరరావు ఎక్సైజ్‌ సీఐ ధనరాజు జి ఆర్‌ పి డి ఎస్‌ పి రత్నరాజు రైల్వే లైన్‌ ఇన్స్పెక్టర్‌ ఎంబి దుర్గారావు ఏలూరు జి ఆర్‌ పి  ఎస్సై సైమన్‌, ఆర్పిఎఫ్‌ ఇన్స్పెక్టర్‌ బెన్నీ ఆర్పిఎఫ్‌ ఎస్‌ఐ ధనుష్‌ ఏఎస్‌ఐ వివి రత్నం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.