LBF News

/ Sep 26, 2025

పునర్నిర్మాణ యుగం ప్రారంభమైంది

. ప్రజల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం

. ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన జీవన స్థితిని కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది

. తెదేపా నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు

నందిగామ : సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు పాల్గొన్నారు. బుధవారం నందిగామలో పార్టీ శ్రేణులతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వర రావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా రైతులు, మహిళలు, యువత మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ‘‘సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు, పాలనలో జవాబుదారీతనం, పారదర్శకతను నిర్ధారించడమే కూటమి లక్ష్యం,’’ అని ఆయన అన్నారు.

                కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రతి ఇంటిలోకి వెళ్లి గడపగడపకూ చంద్రబాబు నాయుడు సంకల్పాన్ని చాటిచెప్పాలన్నారు. గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో జరిగిన నష్టంతో పాటు ఏడాది కాలంలోనూ ప్రజలుమెచ్చిన పాలన అందించామని గణాంకాలతో అందించాలని వివరించారు. అత్యధిక కుటుంబాలకు మేలు చేకూర్చేలా తల్లికి వందనం కింద గతంలో ఒక్కరికే రూ.15 వేలు చెల్లిస్తే, ఇప్పుడు ఇద్దరికి మించి పిల్లలున్న వారందరికి రూ.30 నుంచి 60వేల వరకు తల్లి ఖాతాలో జమ చేసిన విషయానికి ప్రాధాన్యత వివరించాలన్నారు. పట్టణప్రాంతాల్లో చెత్తపన్ను రద్దు చేయడం, పేదల కోసం అన్నక్యాంటీన్లను ప్రారంభిం చడం, నెలవారీ పింఛన్‌ను రూ.నాలుగు వేలకు పెంచడం, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే జీవో 117 రద్దు, ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, మెగా డీఎస్సీ, ఒంటరి మహిళలకు పింఛన్లు, డ్వాక్రా సంఘాల్లో రుణ వితరణలో ప్రాధాన్యత వంటి అంశాలతో పాటు ఉచితగ్యాస్‌ పథకమే కాకుండా కొద్దిరోజుల వ్యవధిలోనే అన్నదాత సుఖీభవ కింద రైతులకు అండగా నిలవడం, ఆగస్టు నుంచి మహిళలందరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని ప్రజలకు వివరించేందుకు అడుగులు వేస్తున్నామని దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో కూటమి నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.