LBF News

/ Sep 27, 2025

పాపికొండల యాత్రకు బ్రేక్‌

  గోదావరి నదికి వరద ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తూ జలవనరులశాఖ ఆదేశాలు జారీ చేసింది. వర్షంతోపాటు గోదావరిలో నీటిమట్టం పెరుగుతున్న కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ..నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. యాత్ర ప్రారంభమయ్యే తదుపరి తేదీని త్వరలోనే వెల్లడిస్తామని వివరించింది.