. బిఆర్ ఎస్ కు టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్
. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది
. బీజేపీ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య కవితకు మద్దతు మాట్లాడటం విచారకరం
. కవిత చెప్పినట్టు బీఆర్‌ఎస్‌లో దెయ్యాలుంటే… కాంగ్రెస్‌లో దేవతలున్నారు
హైదరాబాద్ : నిన్నటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు పదేళ్ల బిఆర్ ఎస్ పాలన..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్దం అని టీపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు.న్యాయం స్థానం తీర్పుకు అనుగుణంగానే రాష్ట్రంలో స్థానికల ఎన్నికల నిర్వహణ ఉంటుంది బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలుపై కాంగ్రెస్ పార్టీ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బుదవారం గాంధీ భవన్ లో విూడియా సమావేశం లో మాట్లడుతూ కాంగ్రెస్ 18 నెలల పాలన గోల్డెన్ పిరియడ్ బీసీ రిజర్వేషన్ల విషయంలో బిజేపి నేతలు నోరు మెదపడం లేదు బీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరాలని కాంగ్రెస్ పార్టీ తపన నిన్న జరిగిన పీసీసీ, పీఏసీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయని తెలిపారు. ఈ సమావేశాల్లో రాబోయే స్థానిక ఎన్నికలకు, జుబ్లీహీల్స్ ఉప ఎన్నికకు పార్టీని సన్నద్ధం చేసేలా పలు కీలక నిర్ణయాలుతో వచ్చే ణష్ట్రఎఞ ఎన్నికలపై అనుసరించాల్సిన వ్యూహలాపై చర్చించాం జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు గెలిచేది మేమే రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేసి రికార్డు సృష్టించడమే కాదు, కాంగ్రెస్ రైతు పక్షపాతి ప్రభుత్వమని మరోసారి నిరూపించుకున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది తెలంగాణలో ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీదే విజయం స్థానిక ఎన్నికల్లో, జుబ్లీహీల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తిరుగుండదు. మూ ముక్కలాటతో బిఆర్ ఏ స్ పార్టీ పని ముగిసింది కవిత చెప్పినట్టు బీఆర్‌ఎస్‌లో దెయ్యాలుంటే… కాంగ్రెస్‌లో దేవతలున్నారు మహిళల అభివ్రుది గురించి కవిత మాట్లాడటం సిగ్గుచేటు బీజేపీ రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య కవితకు మద్దతు మాట్లాడటం విచారకరం క్యాబినెట్ లో 5 గురు దళితులకు చోటు కల్పించాం రైతు సంక్షేమం కోసం లక్షా 4 వేల కోట్లు కేటాయించాం పదేళ్ల బిఆర్ ఎస్ పాలనలో వెలగబెట్టింది ఏంటి అంటే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఫోన్ ట్యాపింగ్ చేశారు ఫోన్ ట్యాపింగ్ తో సినీ తారల కుటుంబంలో చిచ్చు పెట్టారు. తుదకు సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాపింగ్ చేశారు దేశ చరిత్రలో ఫోన్ ట్యాపింగ్ హేయమైన చర్య ఫోన్ ట్యాపింగ్ లో ఎంతటి వారు ఉన్నా సరే శిక్ష తప్పదు కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ పలు పథకాల్లో జరిగిన కుంభకోణాలను వెలుగుతీసి ఎవరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు. బిఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో ఒక్క ప్రాజెక్టు సరిగ్గా పూర్తి చేయలేదు కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నారు అభూత కల్పనతో బిఆర్ యస్ పార్టీ సోషల్ విూడియా నడుపుతున్నారు వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కేంద్రం ప్రభుత్వం రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను, పథకాలను మంజూరు చేయకుండా వివక్ష చూపిస్తోంది బనకచర్లతో రాష్ట్రానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరకోం పోతిరెడ్డి ప్రాజెక్టు కట్టుకోమని జీవోలు ఇచ్చింది బిఆర్‌ఎస్ కదా? కృష్ణాజలాల విషయంలో హరీశ్ రావు సంతకం ఎందుకు పెట్టారని మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు.