LBF News

/ Sep 24, 2025

దక్షిణ భారతంలో ఇలాంటి స్కూల్‌ మరొకటి ఉండదేమో!

నెల్లూరు :  సౌత్‌ ఇండియాలో ఇన్ని వసతులు ఉన్న స్కూల్‌ మరొకటి ఉండదేమోనని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌   అన్నారు. నెల్లూరు నగరంలో వీఆర్‌(వెంకటగిరి రాజా వారి) మున్సిపల్‌ కార్పోరేష్‌ హైస్కూల్‌ ను మంత్రి  లాంఛనంగా ప్రారంభించారు. ఎంతోమంది ప్రముఖులు చదువుకున్న వీఆర్‌ హైస్కూల్‌ గత ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యానికి గురై మూతపడిరది. 1875లో నగరం నడిబొడ్డున 12 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన పాఠశాలలో స్థానికులతో పాటు పొరుగు జిల్లాల నుంచి వచ్చి ఎంతోమంది విద్యార్థులు చదువుకున్నారు. ఈ పాఠశాలలోనే చదువుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ చొరవ తీసుకుని రూ.15 కోట్ల వ్యయంతో పాఠశాలను ఆధునీకరించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన వీఆర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ హైస్కూల్‌ ను పురపాలక శాఖ మంత్రి నారాయణతో కలిసి మంత్రి నారా లోకేష్‌ ప్రారంభించారు. జిల్లా ఇంఛార్జ్‌ మంత్రి ఎన్‌ ఎండీ ఫరూక్‌, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి, నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌ పి.షరణితో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పీ`4 స్ఫూర్తితో డీఎస్‌ ఆర్‌ గ్రూప్స్‌ నిధులతో మూలాపేటలో బాలికల ఉన్నత పాఠశాల, వీపీఆర్‌ ఫౌండేషన్‌ నిధులతో ఆర్‌ ఎస్‌ ఆర్‌ మున్సిపల్‌ హైస్కూల్‌ లో మౌలిక సదుపాయాల కల్పనకు శంకుస్థాపన చేశారు. ముందుగా కళాశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్‌ కు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, పాఠశాల సిబ్బంది ఘనస్వాగతం పలికారు.