LBF News

/ Sep 26, 2025

టాటా మోటార్స్‌ అమ్మకాలు మే నెలలో 70,187 యూనిట్లు

ముంబై: మే 2025లో దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో టాటా మోటార్స్‌ లిమిటెడ్‌ అమ్మకాలు 70,187 యూనిట్లుగా ఉన్నాయి. మే 2024లో 76,766 యూనిట్లు మాత్రమే ఉన్నాయి. ఇందులో మొత్తం సీవీ అమ్మకాలు 28,147 యూనిట్లు, అంటే సంవత్సరం నుంచి సంవత్సరానికి చూస్తే, 5% తక్కువగా నమోదైంది. అలాగే, మొత్తం పీవీ అమ్మకాలు 42,040 యూనిట్లు, అంటే సంవత్సరం నుంచి సంవత్సరానికి చూస్తే, 11% తక్కువగా నమోదైంది. ఈ నెలలో మొత్తం దేశీయ అమ్మకాలు 67,429 యూనిట్లు ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో 75,173 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంటే 10% తక్కువగా విక్రయాలు నమోదైనట్లుగా కంపెనీ పేర్కొంది. మే 2025లో ఎంహెచ్‌, ఐసీవీ దేశీయ అమ్మకాలు, ట్రక్కులు, బస్సులతో సహా, గత ఏడాది 12,987 యూనిట్లతో పోలిస్తే 12,406 యూనిట్లుగా ఉన్నాయి.