LBF News

/ Sep 24, 2025

గురజాలలో మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

. పాల్గొన్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

గురజాల :  ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు, మహాజన నేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గురజాల మండలం టౌన్‌ లో ఎమ్మార్పీఎస్‌ దిమ్మ దగ్గర జండా ఆవిష్కరణ జరిగింది. 31వ ఆర్భవం దినోత్సవం పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ 60వ పుట్టినరోజు సందర్భంగా కేక్‌ కట్‌ చేసి వృద్ధాశ్రమంలో కాయలు, పండ్లు వృద్దలకు పంచి పెట్టినారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌, ఎంఎస్పి గురజాల నియోజక అధ్యక్షుడు విూసాల బాబు మాదిగ, మాజీ జెడ్పిటిసి శ్యామ్‌ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌  కత్తి ప్రాసంగి మాదిగ, గురజాల నియోజవర్గం అధ్యక్షుడు రాంబాబు, టిడిపి ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు వంశి, చింతకాయల దానయ్య, జనసేన కళ్యాణ్‌, గురజాల నియోజకవర్గ అధ్యక్షురాలు అడ్లమూడి కోటేశ్వరి, పిడుగురాళ్ల మండల అధ్యక్షురాలు రేపక్క టిడిపి ఎస్సీ సెల్‌ వంశి మాదిగ, ఎమ్మార్పీఎస్‌ ఎన్నో ఉద్యమాలు ఎన్నో పోరాటాలు ఎస్సీ వర్గీకరణ ఏబీసీ సాధించాం అని అన్నారు. వికలాంగులకు 6వేలు పింఛన్‌, వృద్ధులకు, ఒంటరి మహిళలకు 4వేలు పింఛన్‌, ఆరోగ్యశ్రీ కార్డు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్‌ ఉద్యమ పోరాటం వల్లే సాధించాం అని ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు పేర్కొన్నారు.