LBF News

/ Sep 24, 2025

కేంద్ర మంత్రి మాండవీయాతో సీఎం రేవంత్‌ భేటీ

న్యూ ఢల్లీి :  కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయతో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా గేమ్స్‌. 40వ నేషనల్‌ గేమ్స్‌, ఏవైనా ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడా  పోటీలకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని  విజ్ఞప్తి చేసారు.

ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి మాండవీయను  ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కోరారు.

జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని కేంద్ర మంత్రిని కోరారు.