LBF News

/ Sep 26, 2025

ఒక్కరోజులో హావిూ నెరవేర్చిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌ యాదవ్‌

. బ్రహ్మం గారి మఠం

సూపరి పాలన తొలి అడుగులో భాగంగా ఇచ్చిన హావిూని ఒక్కరోజులోనే నెరవేర్చి ప్రజలందరూ అబ్రపోయేలా అనిపించుకున్నాడు ఆయనే మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్‌ యాదవ్‌ గారు వివరాల్లోకెళ్తే రెండు రోజుల క్రితం సుపరిపాలన లో భాగంగా మైదుకూరు పట్టణంలోని 18వ వార్డులో ఎమ్మెల్యే ఇతర నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేస్తూ ఏడాది పాటు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని వచ్చిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారులు ఆదేశిస్తూ వచ్చిన విషయం పాఠకులకు తెలిసినదే అందులో భాగంగానే 18వ వార్డులో త్రాగునీటికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా కేవలం 24 గంటల లోగా అంటే ఒక్క రోజులోనే 18 వ వార్డు లో బోరువేపించి దానికి మోటారు బిగించి మంచినీళ్లు ఆ వార్డులోని ప్రజలకు అందేలా ఎమ్మెల్యే గారు సంబంధిత మున్సిపాలిటీ నిరంజన్‌ రెడ్డి వారి సిబ్బంది ద్వారా ఏర్పాటు చేయించారని 18 వ వార్డులోని ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు ఇక్కడ మాకు ఉన్న త్రాగునీటి కష్టాలను ఈ నూతనబోరుతో తీరిందని వారు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్చార్జి ప్రశాంతి టిడిపి సీనియర్‌ నాయకులు జనాపాల రవీంద్ర శెట్టి కోనా సుబ్బారావు బండి అమర్నాథ్‌ ఇతర నాయకులు, కార్యకర్తలు ఆ వార్డులోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు.