ఏలూరు : ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసి వారి వద్ద బంగారు ఆభరణాలను తస్కరిస్తున్న ముఠాకు చెందిన 4 గురు నిందితులను కైకలూరు రూరల్ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుండి 60 గ్రాముల బంగారు ఆభరణాలు,లక్ష రూపాయల నగదు రికవరీ చేశామని జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ విలేకరుల సమావేశంలో శుక్రవారం సాయంత్రం వెల్లడిరచారు. కేసును చేదించిన కైకలూరు రూరల్ సీఐ రవికుమార్ ఎస్‌ఐ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ఇచ్చారు.
బాధితులకు రికవరీ చేసిన బంగారాన్ని అప్పగించారు.