ముంబయిః 2025 ఏప్రిల్ మాసంలో టాటా మోటార్స్ లిమిటెడ్ ఏకంగా 72,753 యూనిట్లను విక్రయించింది. ఇందులో మొత్తం సీవీ అమ్మకాలు 27,221 యూనిట్లు ఉండగా, పీవీ అమ్మకాలు 45,532 యూనిట్లు ఉన్నాయి. అయితే వైఓవై అంచనా ప్రకారం చూస్తే సీవీ అమ్మకాలు 8 శాతం, పీవీ అమ్మకాలు 5 శాతం తగ్గుదలను చూపించాయి. 2025 ఏప్రిల్ నెలలో దేశీయ విక్రయాలు 70,963 యూనిట్లు ఉన్నాయి. గత ఏడాది ఇదే మాసంలో 76,399 యూనిట్లు ఉన్నాయి. వాణిజ్య వాహనాల్లో హెచ్‌సీవీ ట్రక్కులు 7,270, ఐఎల్‌ఎంసీవీ ట్రక్కులు 4,680, ప్యాసింజర్ క్యారియర్లు 4,683, ఎస్‌సీవీ కార్గో పికప్ వాహనాలు 9,131 యూనిట్లు ఓవరాల్‌గా సీవీ డొమెస్టిక్ వాహనాలు 25,764 యూనిట్లు ఉన్నాయి.
ఏప్రిల్‌లో 72,753 యూనిట్లు విక్రయించిన టాటా మోటార్స్
