LBF News

/ Sep 24, 2025

ఏపీలో జనవరిలో మరో 70 అన్న క్యాంటీన్ల ఏర్పాటు

ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్న క్యాంటీన్‌ ఉండేలా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రస్తుతం 113 నియోజకవర్గాల్లో క్యాంటీన్లు ఉన్నాయి. మిగిలిన 62 నియోజకవర్గాల్లోనూ జనవరి నెలలో కొత్తగా ప్రారంభించనున్నారు. డిసెంబర్‌ నాటికి వాటిని సిద్ధం చేయనున్నారు. కాగా కూటమి ప్రభుత్వం రూ.5కే ఆహారం అందించగా ఒక్కో క్యాంటీన్లో రోజుకు మూడు పూటలా 900 మందికి పైగా అల్పాహారం, భోజనం చేస్తున్నారని అంచనా.