. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నా అపోహలు..
. నగదు అవసరాల్లో క్రెడిట్ కార్డులు కొంత వెసులుబాటు
హైదరాబాద్ : ఏది నిజం.. క్రెడిట్ కార్డులపై ఈ అపోహలు వద్దు నగదు అవసరాల్లో క్రెడిట్ కార్డులు కొంత వెసులుబాటును, మరికొంత సౌకర్యాన్నిస్తాయి. అయితే వీటిపై నెలకొన్న కొన్ని అపోహలు.. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఫలితంగా అవి వారి ఆర్థిక సామర్థ్యాన్నీ దెబ్బతీస్తున్నాయి. నిజానికి డిజిటల్ ఫైనాన్స్ నానాటికీ విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డులపై పేరుకుపోయిన అపోహలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిపుణులు ఏం చెప్తున్నారు?
ఏది నిజం.. క్రెడిట్ కార్డులపై ఈ అపోహలు వద్దు.. నగదు అవసరాల్లో క్రెడిట్ కార్డులు కొంత వెసులుబాటును, మరికొంత సౌకర్యాన్నిస్తాయి. అయితే వీటిపై నెలకొన్న కొన్ని అపోహలు.. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నాయి. ఫలితంగా అవి వారి ఆర్థిక సామర్థ్యాన్నీ దెబ్బతీస్తున్నాయి. నిజానికి డిజిటల్ ఫైనాన్స్ నానాటికీ విస్తృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో క్రెడిట్ కార్డులపై పేరుకుపోయిన అపోహలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మరి నిపుణులు ఏం చెప్తున్నారు?
మినిమం పేమెంట్స్‌పై క్రెడిట్ కార్డుపైనున్న బకాయిని పూర్తిగా చెల్లించకుండా మినిమం పేమెంట్స్ లేదా దానిపై వడ్డీలు చెల్లిస్తూపోతే క్రెడిట్ స్కోర్ పెరుగుతుందని చాలామంది అనుకుంటున్నారు. కానీ ఇది అపోహే. ప్రతి నెలా విూ బకాయిలను పూర్తిగా చెల్లించడమే మంచిది. అప్పుడే క్రెడిట్ స్కోర్ పెరగడానికి వీలుంటుంది. కాబట్టి నెలనెలా విూ పూర్తిస్థాయి బకాయి వాయిదాలను చెల్లిస్తూ వడ్డీ చార్జీలకు దూరంగా ఉండండి. దీనివల్ల రుణదాత (బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు)లకు విూ ఆర్థిక క్రమశిక్షణ నచ్చుతుంది. అది అంతిమంగా విూ క్రెడిట్ స్కోర్ పురోగతికి దోహదపడగలదు.
పాత కార్డులపై వాడని పాత క్రెడిట్ కార్డులను క్లోజ్ చేసుకోవాలన్నది మంచి ఆలోచనే. అయితే అది విూ క్రెడిట్ స్కోర్‌ని దెబ్బతీసే అవకాశమున్నది. ఎందుకంటే పాత కార్డులను తీసేస్తే విూకు అందుబాటులో ఉండే మొత్తం రుణ పరిమితి తగ్గిపోతుంది. కాబట్టి విూ పాత కార్డులనూ ఉంచుకోండి. ప్రధానంగా వార్షిక చార్జీలు లేకపోతే అస్సలు వాటిని వదులుకోవద్దు.
ఒక్కటే కార్డు..
అసలు ఒక్క క్రెడిట్ కార్డూ లేకపోవడం కంటే ఒకటైనా ఉండటం ఉత్తమం. అయితే ఒకటికి మించి క్రెడిట్ కార్డులు ఉండటం వల్ల విూ రుణ పరపతికి అవి అద్దం పడుతాయి. రివార్డు పాయింట్లు పెరిగి విూ క్రెడిట్ స్కోర్, అందుబాటులో ఉండే రుణ లభ్యత కూడా పెరుగుతుంది. కనుక రోజువారీ అవసరాలకు, ప్రయాణాలు లేదా రివార్డులకు, తక్కువ అధిక రుణాల కోసం ఇలా వేర్వేరు అవసరాలకు 2`3 క్రెడిట్ కార్డులను మెయింటేన్ చేయండి.
రుణ భారం
క్రెడిట్ కార్డులను దుర్వినియోగం చేస్తేనే రుణ భారం పెరుగుతుంది. నిజానికి సరిగ్గా వాడితే ఇవి శక్తివంతమైన ఆర్థిక సాధనాలే. వడ్డీరహిత రుణాలు, రివార్డులు తదితర ప్రయోజనాలను పొందవచ్చు.
కొత్త కార్డులు
క్రెడిట్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడం వల్ల క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది అన్నది కూడా పూర్తిగా నిజం కాదు. అయితే అతిగా క్రెడిట్ కార్డుల కోసం ఆరా తీయడం, దరఖాస్తులు చేసుకోవడం మాత్రం ఇబ్బందికరమే. కానీ ఏటా ఒకటి లేదా రెండు విచారణలు క్రెడిట్ కార్డుల కోసం చేయడం వల్ల క్రెడిట్ స్కోర్‌కు దీర్ఘకాలంలో వచ్చే ప్రమాదమేవిూ లేదు. పైగా కొత్త కార్డుతో క్రెడిట్ స్కోర్ పెరిగేందుకే ఎక్కువగా అవకాశాలున్నాయి.
డెబిట్ కార్డులే ఉత్తమం?
క్రెడిట్ కార్డుల కంటే డెబిట్ కార్డులే ఉత్తమమన్న అభిప్రాయం చాలామందిలో ఉన్నది. అయితే విూ ఖాతాలో నగదు నిల్వలున్నప్పుడే డెబిట్ కార్డులకు విలువ. కానీ క్రెడిట్ కార్డులతో చేతిలో నగదు లేకున్నా.. కనీస అవసరాలను తీర్చుకునే వెసులుబాటు ఉంటుంది. షాపింగ్‌లు, ఇతర కొనుగోళ్లలో నగదు రాయితీలు, ప్రోత్సాహకాలనూ పొందవచ్చు. అయితే మితివిూరిన ఖర్చులు చేస్తే మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. కాబట్టి వివేకంతో వ్యవహరించాలి.