హైదరాబాద్ : వ్యాపార సాంకేతిక రంగంలో సంభావ్య మార్పును సూచించే చర్యలో భాగంగా ఎంటర్‌ప్రైజ్ ఏఐ మరియు ఏజెంటిక్ ఏఐ ఆధారిత సేవలను సాఫ్ట్‌వేర్‌గా అందించటంలో అభివృద్ధి చెందుతున్న సంస్థ కోవాసంట్ టెక్నాలజీస్, నేడు టెక్ పరిశ్రమ దిగ్గజం ఫణీష్ మూర్తి తమ సలహా బోర్డులో చేరారని, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆయన తమకు సేవలను అందించనున్నారని వెల్లడిరచింది. అనుభవజ్ఞులైన, వ్యూహాత్మక నాయకత్వ మార్గనిర్దేశనం ద్వారా బాధ్యతాయుతంగా, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందటానికి, విప్లవాత్మక సాంకేతికత ద్వారా ఎంటర్‌ప్రైజ్ ఐటి యుగాన్ని నడిపించాలనే కోవాసంట్ లక్ష్యంను ఈ నియామకం బలోపేతం చేయనుంది.
ఏఐ ఛాలెంజర్ కోవాసంట్ లో చేరిన ఐటి సేవల దిగ్గజం ఫణీష్ మూర్తి
