LBF News

/ Sep 26, 2025

ఇంచార్జీ విూనాక్షి నటరాజన్‌తో ముగిసిన  కొండా దంపతుల భేటీ

. నిబంధనల ప్రకారమే తాను పని చేస్తున్నా: మంత్రి కొండా సురేఖ

. రాహుల్‌ను ప్రధాని చేయడమే తమ లక్ష్యం

. రేవంత్‌ను మరో పదేళ్లు సిఎంగా చూడాలనుకుంటున్నా

. రాజకీయాల విషయంలో ఎవరికీ భయపడేది లేదు

. సుష్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖ రక్తం

హైదరాబాద్‌ :  నిబంధనల ప్రకారమే తాను పని చేస్తున్నానని మంత్రి కొండా సురేఖ   తెలిపారు. తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తున్నానని అన్నారు. ఇంచార్జీ విూనాక్షి నటరాజన్‌తో కొండా దంపతుల భేటీ ముగిసింది. తమపై వచ్చిన ఆరోపణలపై కొండా దంపతులు వివరణ ఇచ్చారు. విూనాక్షి నటరాజన్‌ను అన్నీ వివరించామని, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ను ప్రధాని చేయడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. రేవంత్‌ను మరో పదేళ్లు సిఎంగా చూడాలనుకుంటున్నామని, స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.వరంగల్‌ జిల్లాలో కాంగ్రెస్‌ జరుగుతున్న రాజకీయాల విషయంలో ఎవరికీ భయపడేది లేదని పేర్కొన్నారు. మంత్రిగా తాను ఇప్పటి వరకు ఎలాంటి తప్పులు చేయలేదని, తన మంత్రి పదవిపై   ఎవరు మాట్లాడినా తాను స్పందించానని కొండా సురేఖ తెలియజేశారు. సుష్మితలో పారేది కొండా మురళి, కొండా సురేఖ రక్తం అని చెప్పారు. తన కూతురికి తమ ఆలోచనలు వంశపారపర్యంగా రావడంలో తప్పులేదని, సుష్మిత రాజకీయ ఆలోచనలను తప్పు పట్టలేం అని కొండా సురేఖ పేర్కొన్నారు. మా కూతురు పరకాలలో పోటీచేసే విషయం తమకు తెలియదన్నారు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.