LBF News

/ Sep 26, 2025

ఆణిముత్యాలు సాయి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు

రాయచోటి : ఉత్తమ ఫలితాలు సాధిస్తూ మెరుగైన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు రాయచోటికి చెందిన శ్రీ సాయి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు. ప్రతి విభాగంలోనూ అత్యుత్తమ మార్కులు సాధించి ర్యాంకుల పంట పండిస్తున్నారు ఈ కళాశాల ఆణిముత్యాలు. కరువు ప్రాంతమైన రాయచోటిలో విద్యా కుసుమాలుగా శ్రీ సాయి ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థులు మంచి మార్కులు తీసుకువస్తూ కళాశాలకే వన్నె తెస్తూ అందరిచే ప్రశంసలు అందుకుంటున్నారు.అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్‌ కళాశాల( అటానమస్‌ ) తృతీయ సంవత్సరం రెండవ సెమిస్టర్‌  ఫలితాల యందు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి యూనివర్సిటీ స్థాయిలో అత్యధిక శాతం మార్కులు సాధించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం. సుధాకర్‌ రెడ్డి  మాట్లాడుతూ ఎప్పటిలాగే యూనివర్సిటీ విడుదల చేసిన తృతీయ సంవత్సర ఫలితాలు యందు  కూడా కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపరిచి యూనివర్సిటీ పరిధిలో కళాశాలను అగ్రస్థానంలో నిలబెట్టారని తెలియజేస్తూ విద్యార్థినీ విద్యార్థులను మరియు కళాశాల అధ్యాపకులను అభినందించారు. తృతీయ సంవత్సర రెండవ సెమిస్టర్‌ ఫలితాలలో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో సయ్యద్‌ సనా సాజియా 94.94 శాతం తో మొదటి ర్యాంకు, కలకడ సఫియా 89.89 శాతంతో రెండవ ర్యాంకు, పఠాన్‌ ముస్కాన్‌ 89.46 శాతంతో మూడవ ర్యాంకు మరియు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగం నుంచి షేక్‌ మూలింటి సబిహ 89.5 శాతంతో మొదటి ర్యాంకు, ఎస్‌ హుమేర  87 శాతంతో రెండవ ర్యాంకు,  ఎం. వెంకట పవిత్ర 86శాతంతో మూడవ ర్యాంకు సాధించారని తెలియజేశారు. కళాశాలలో అకాడమిక్‌ అంశాలతో పాటు, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, అర్థమెటిక్‌ రీజనింగ్‌ విభాగాలలో  ప్రత్యేక శిక్షణ కల్పించి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నామని తెలియజేశారు. ఫలితాల యందు ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థినీ విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి .బాలాజీ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎం. వెంకటరమణ  కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌ బాగాధిపతి  శుభహాన్‌  , ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగాధిపతి ం. కరుణాకర్‌ వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు అభినందించారు.