LBF News

/ Sep 25, 2025

అమేజాన్‌ ప్రైమ్‌ డేకి ఫ్యాషన్‌, బ్యూటీ సందడి

బెంగళూరు: ప్రైమ్‌ డే మళ్లీ వచ్చింది. ఇందులో భాగంగా జులై 12 నుండి 14 వరకు, అమేజాన్‌ ప్రైమ్‌ సభ్యులు 72 గంటలు నిరంతరంగా ఫ్యాషన్‌, బ్యూటీ ఆవిష్కరణలలో నిమగ్నం కావచ్చు. ఫోమో ఫ్యాషన్‌ ఇంక ఎంత మాత్రం లేదు- వార్డ్‌ రోబ్‌ను ఒక స్టైల్‌ స్టేట్మెంట్‌గా చేయడానికి ఇది సమయం. కారాట్‌ లేన్‌, గ్యాప్‌, సఫారీ ఎక్స్‌ బోట్‌, అర్బన్‌ జంగిల్‌, లావీ సిగ్నేచర్‌, సింబల్‌ ప్రీమియం, టైటాన్‌ రాగా, ఇంకా ఎన్నో ప్రముఖ బ్రాండ్స్‌ నుండి ఉత్తేజభరితమైన కొత్త ఉత్పత్తి విడుదలలు, తాజా స్టైల్స్‌, ప్రీమియం యాక్ససరీస్‌, ట్రెండిరగ్‌ లుక్స్‌ ను కూడా కస్టమర్లు అన్వేషించవచ్చు. ఈ ఏడాది ప్రైమ్‌ డే కూడా గోల్డ్‌, డైమండ్‌ జ్యువలరీలో కొత్త డ్రాప్స్‌ ను చేర్చింది, స్టేకబుల్స్‌, విలక్షణమైన రోజూ ధరించదగిన కారాట్‌ లేన్‌ వంటి బ్రాండ్స్‌ నుండి ఆభరణాలు దీనిలో భాగంగా ఉన్నాయి. సీజనల్‌ షాపింగ్‌ ను మరింత సులభంగా చేయడానికి, ప్రత్యేకంగా రూపొందించిన మాన్‌ సూన్‌ స్టోర్‌ ఫ్యాషన్‌  ఈ సమయానికి  అనుకూలమైన ఫ్యాషన్‌, బ్యూటీ ఎంపికలను ఒక చోట చేర్చింది- ఇవన్నీ 60% వరకు తగ్గింపుతో లభిస్తాయి.