LBF News

/ Sep 26, 2025

అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌లో ఐక్యూ ఎక్స్‌క్లూజివ్‌ డీల్స్‌

బెంగళూరుః అమెజాన్‌ గ్రేట్‌ సమ్మర్‌ సేల్‌ 2025 కోసం హై పెర్ఫార్మెన్స్‌ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది. ఐక్యూ జెడ్‌9 లైట్‌, ఐక్యూ జెడ్‌9ఎక్స్‌, ఐక్యూ జెడ్‌9ఎస్‌, ఐక్యూ జెడ్‌ 10ఎక్స్‌, ఐక్యూ జడ్‌10ఎక్స్‌, ఐక్యూ జడ్‌10, ఐక్యూ నియో 10ఆర్‌, ఐక్యూ 12, లేటెస్ట్‌ ఐక్యూ 13 వంటి అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లపై వినియోగదారులు తిరుగులేని ఆఫర్లను పొందవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాన సేల్‌ ప్రారంభమవుతుంది. అమెజాన్‌ ప్రైమ్‌ సభ్యులకు అర్ధరాత్రి నుండి ప్రత్యేకమైన ముందస్తు యాక్సెస్‌ విండో లభిస్తుంది. అత్యుత్తమ పనితీరును అందించడంలో పేరొందిన ఐక్యూ స్మార్ట్‌ఫోన్‌లు అమెజాన్‌లో అత్యధిక రేటింగ్‌ పొందిన 5జీ డివైజ్లలో ఒకటిగా నిలిచాయి. అమెజాన్‌ సమ్మర్‌ సేల్‌ 2025 సందర్భంగా కస్టమర్లు అనేక రకాల ఆకర్షణీయమైన ఆఫర్లను పొందవచ్చు.