LBF News

/ Sep 26, 2025

అనంతగిరి ఆడవిలో యువకుడి మృతి

వికారాబాద్‌ జిల్లా : వనపర్తి జిల్లా, గోపాల్‌ పూరుపేట్‌ మండల్‌, ఏదుట్ల గ్రామానికి చెందిన రమేష్‌ (33) రెండు రోజుల క్రితం అనంతగిరి కి పర్యాటక కేంద్రానికి వచ్చి అనంతగిరి అడవి ప్రాంతంలో ఫారెస్ట్‌ పార్కింగ్‌ లో యాక్టివా వాహనం ుూ13ఇఓ8580 నీ పార్కు చేసి రెండు రోజుల నుండి బైక్‌ దగ్గరికి రాకపోవడంతో ఫారెస్ట్‌ వాళ్లు ఎంత వెతికిన కనపడకపోవడంతో ఎవరో వదిలి వెళ్లారు అని అనుకున్నారు అయితే రమేష్‌ వాళ్ళ కుటుంబ సభ్యులకు అనంతగిరి పోయినట్టు ఫోన్‌ లొకేషన్‌ ద్వారా గమనించి పోలీసుల సహాయంతో మృతదేహాన్ని గుర్తించారు.  మృతదేహాన్ని వికారాబాద్‌ ఎస్సై వెంకటరాజు పరిశీలించి వికారాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.