LBF News

/ Sep 24, 2025

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : ఎమ్మెల్యే కోట్ల

బేతంచర్ల : అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని డోన్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్‌ రెడ్డి తెలిపారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా డోన్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్‌ రెడ్డి బేతంచెర్ల మండలంలోని హెచ్‌. కొట్టాల, కొమ్మూరు కొట్టాల, గొర్లగుట్ట గ్రామాలకు సోమవారం నాడు విచ్చేసి ఇంటింటికి తిరిగి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఉన్నారు. వీరిద్దరూ గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులతో చర్చించి వాటిని వెంటనే పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టి.డి.పి నాయకులు పాల్గొన్నారు.