LBF News

/ Sep 26, 2025

యోగాంధ్రకు కదలిన బస్సులు

విజయనగరం : యోగాంధ్ర ట్రయల్‌ రన్‌ ను జిల్లా కలెక్టర్‌ డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ ప్రారంభించారు. కలెక్టరేట్‌ నుండి  16  బస్సు లు కదిలాయి. బస్‌ లో జిల్లా కలెక్టర్‌, జిల్లా అధికారులు, లైజన్‌ అధికారులు ప్రయాణించారు. వేదికల వద్దకు చేరుకొని  జిల్లాకు కేటాయించిన కంపార్టమెంట్స్‌ ను సందర్శించి తిరిగి వస్తారు. ఈ నెల 21 వ తేదీన విశాఖ వేదికగా జరగబోవు అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ఏ విధంగా పాల్గొనాలో ప్రజలకు అధికారులు వివరించనున్నారు.