. నాకు పదవి ఇచ్చిన పార్టీ నాయకులకు ధన్యవాదములు
. కష్టపడ్డ వారికి పార్టీ గుర్తిస్తుంది : ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి
పోరుమామిళ్ల (బ్రహ్మంగారిమఠం) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో నిబద్దతతో నిజాయితీతో పని చేస్తానని కాశీనాయన మండలం, సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన యువకుడు ఎలిచెర్లనాగ సుబ్బారెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా రైతు విభాగ ప్రధాన కార్యదర్శి పదవి చేపడుతున్న ఈ సందర్భం లో తెలిపారు .సోమవారం రాత్రి పోరుమామిళ్ల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారి కి,రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి గార్లు కుపూలమాల మరియు శాలువాలతో నాగ సుబ్బారెడ్డి తో పాటు ఇతర నాయకులు సత్కరించారు.
ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు స్పందిస్తూ, నాగ సుబ్బారెడ్డి యువకుడు, ఉత్సాహవంతుడు కావడంతో అతనికి ఈ పదవి రావడం హర్షనీయం అని అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వ హయాంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లి తగిన పరిష్కారాలు తీసుకురావాలని సూచించారు.ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి గారు మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. పార్టీకి విధేయంగా పనిచేసే వారికి పదవులు తప్పకుండా వస్తాయన్నారు.
పదవి బాధ్యత స్వీకరించిన నాగ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ‘‘నాపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి కడప జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి పార్లమెంట్ సభ్యులు వైయస్ అవినాష్ రెడ్డి గారికి శాసనసభ్యురాలు వెంకట సుధా గారికి ఎమ్మెల్సీ డిసి గోవింద్ రెడ్డి గారికి ఇతర నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. నాకు అప్పగించిన బాధ్యతలను నిజాయితీగా, విబద్ధతతో అంకితభావంతో కృషి చేస్తానని నాగ సుబ్బారెడ్డి తెలిపారు
ఈ కార్యక్రమంలో మాజీ పంచాయతీరాజ్ ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి , నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమణారెడ్డి, కాశి నాయన మండలం జెడ్పిటిసి దేవసాని సత్యనారాయణ రెడ్డి, కాశి నాయన మండల కన్వీనర్ హనుమంతు రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు క్లాస్ వన్ కాంట్రాక్టర్ పంగా గురివి రెడ్డి, పోరుమామిళ్ల మండలం జెడ్పిటిసి ముత్యాల ప్రసాద్,పోరుమామిళ్ల మండల కన్వీనర్ సీఎం భాష, కాశి నాయనమండలం పార్టీ ఎం కృష్ణారెడ్డి , నరసింహారెడ్డి, గురువు రెడ్డి, గంటా రమణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి చాపాటి నారాయణరెడ్డి, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రెటరీ రాళ్లపల్లి నరసింహులు, జిల్లా ప్రచార విభాగ అధ్యక్షులు రాజీవ్ భాష, నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పొదిలి మస్తాన్ మనీ, వార్డు మెంబర్ తులసి సురేష్, బాబు, పెసల గణేష్, జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు సాయి నారాయణ రెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.