LBF News

/ Sep 26, 2025

అనుమానాస్పద స్థితి లో గుర్తు తెలియని శవం

రాయచోటి : రాయచోటి పట్టణ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి లో అనుమానాస్పద స్థితి లో గుర్తు తెలియని శవం ఉన్నట్లు మంగళవారం ఉదయం పోలీసులు గుర్తించారు. తల, ముఖం, చేతి పై రక్త గాయాలు ఉన్నాయన్నారు. ఇక్కడ చంపారా లేదా బయట చంపే ఇక్కడికి తీసుకొచ్చి పడేసారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పంచనామా నిమిత్తం బాడీని మార్చురీకి వైద్య సిబ్బంది తరలించారు. మిగతా  వివరాలు తెలియాల్సి ఉంది.