LBF News

/ Sep 26, 2025

విజయ్‌ సేతుపతి, సంయుక్త రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, వెర్సటైల్‌ యాక్టర్‌ విజయ్‌ సేతుపతి తొలిసారిగా కలిసి చేస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ పాన్‌`ఇండియా మూవీ చపూరిసేతుపతి. ఈ ప్రాజెక్ట్‌ను జెబి మోషన్‌ పిక్చర్స్‌ జెబి నారాయణ్‌ రావు కొండ్రోల్లా కొలాబరేషన్‌ లో పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌ నిర్మిస్తున్నారు. చార్మీ కౌర్‌ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో టాలీవుడ్‌ లక్కీ చార్మ్‌ సంయుక్త కథానాయికగా నటిస్తోంది.

ఇటీవలే లాంచ్‌ అయిన ఈ సినిమా ఈరోజు హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించింది. ప్రస్తుతం విజయ్‌ సేతుపతి, సంయుక్త, ఇతర తారాగణం సభ్యులు పాల్గొనే కీలక సన్నివేశాలను భారీ సెట్‌లో చిత్రీకరిస్తున్నారు. ఎలాంటి బ్రేక్స్‌ లేకుండా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతుంది.దర్శకుడు పూరి జగన్నాథ్‌ సినిమా ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టబు, విజయ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ట్రూ పాన్‌`ఇండియా ఎంటర్‌టైనర్‌గా చపూరి సేతుపతి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే లక్ష్యంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం,హిందీ ఐదు భాషలలో విడుదల కానుంది.

తారాగణం: విజయ్‌ సేతుపతి, సంయుక్త, టబు, విజయ్‌ కుమార్‌.