. ఏఐటియుసి బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్,
బద్వేల్ : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటియుసి ఇచ్చిన పిలుపులో మేరకు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గురయ్యా అధ్యక్షతన మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ ధర్నాని ఉద్దేశించి ఏఐటీయూసీ బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అవుతున్న ఇంతవరకు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హావిూని ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని గత ప్రభుత్వంలో విభజించు పాలించు అనే విధంగా పారిశుద్ధ్య కార్మికులకు ఒక రకమైన వేతనం ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు ఇంకొక విధంగా ఇచ్చారు అయితే ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా మున్సిపాలిటీని నమ్ముకుని పని చేస్తా అన్నారు ఈరోజు నిత్యవసర వస్తువుల ధరలు అనుకూలంగా కూడా వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గుచేటని వారు అన్నారు రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి అందించాలని అలాగే మున్సిపాలిటీలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడ్ని పర్మినెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఈనెల 11వ తేదీన కలెక్టరేట్ కార్యాలయం ఎదుట జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నరసింహులు శ్రీనివాసరాజు ఆదినారాయణ వెంకట్ రెడ్డి ఆదినారాయణ రెడ్డి దేవా శ్రీనివాసులు నరసయ్య బాబి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.