ప్రశాంతంగా ముగిసిన మొహరం వేడుకలు
కౌతాళం : త్యాగాలకు ప్రతీకగా, కుల మతాలకు ము అతీతంగా మొహర్రం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం కౌతాళం, కామవరం, బాధినేహాల్, నడిచాగి.తదితర గ్రామాలలో పీర్లను ఊరేగించారు. హసన్ హుస్సేన్ ఇమామ్ ఏ ఖాసిం, అక్బర్ వలి తదితర పేర్లను ముందుగానే శ్రీ జగద్గురు ఖాదర్ లింగ స్వామి దర్గా ఆవరణంలోకి చేరుకున్నారు. దర్గా పీఠాధిపతులు శ్రీ సయ్యద్ మున్నా పాషా ఆధ్వర్యంలో ఊరేగింపుగా తీసుకెళ్లారు. పీర్ల ఊరేగింపు తిలకించడానికి భారీ ఎ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం కర్బల మైదానంలో దఫన్ కార్యక్రమం నిర్వహించి మొహర్రం ముగింపు కార్యక్రమం చేపట్టారు. అనంతరం వారి త్యాగాలను స్మరిస్తూ దుఃఖ సాగరంతో స్థానానికి చేరుకున్నారు. సోమవారం మండల పరిధిలో బాపూరాం రౌడూర్, బంటకుంట హల్వి,సులేకేరి, పొదల కుంట. ఏరిగేరి. తదితర గ్రామాల్లో మొహరం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి రొట్టెలు పంచుకున్నారు.ఎలాంటి అవాంచనీయ సంఘటన జరగకుండా సిఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.