LBF News

/ Sep 26, 2025

ముత్యాలపాడు గ్రామంలో మొహర్రం ఊరేగింపు

చాగలమర్రి : చాగలమర్రి మండలంలోని ముత్యాలపాడు గ్రామంలో మొహర్రం వేడుకల సందర్భంగా కొలువుదీరిన ప్రధాన పీరు లాలుస్వామిని సోమవారం సాంప్రదాయబద్ధంగా ఊరేగింపు చేశారు. లాలుస్వామిని పురవీధుల గుండా భారీ జనసందోహం మధ్య హిందూ, ముస్లీం సోదరులు పరస్పరంగా ఒకరికి ఒకరు గంధం చల్లుకుంటూ డప్పు, మేళాలతో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి లాలుస్వామి ఊరేగింపును తిలకించారు. అనంతరం మకానం వద్ద పిల్లలు, పెద్దలు, మహిళలు ఫాతేహాలు చేశారు. ఊరేగింపు అనంతరం పీర్లను శుద్ధి చేసి పెట్టెలో భద్రపరిచారు. ఎస్సై సురేష్‌ నాయుడు అధ్వరంలో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో లాలుస్వామి మకానం కమిటీదారులు సయ్యద్‌ భై గారి రసూల్‌, మాబు సుబహాని, సయ్యద్‌ షరీఫ్‌, రసూల్‌ బాషా మరియు సయ్యద్‌ బ్రదర్స్‌ పాల్గొన్నారు…