. సుక్రపుట్టులో తొలి అడుగు ఇంటింటా ప్రచారం
. రాష్ట్ర జిసిసి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్
అరకులోయ : సూపర్ సిక్స్ పథకాలను ఎన్నికల్లో ఇచ్చిన హావిూలను పక్కగా అమలు చేస్తామని రాష్ట్ర జిసిసి చైర్మన్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు. సుపరి పాలన తొలి అడుగు కార్యక్రమములో భాగంగా బోయిన పొత్తి ఆధ్వర్యంలో డుంబ్రిగూడ మండలం సుక్రపుట్టు గ్రామంలో సోమవారం రోజున పాల్గొన్నారు. గత ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని ఆర్థికంగా విచ్చిన్నంగా చేశారన్నారు. మాట్లాడుతూ ఇంటింటా ప్రచారంలో సంక్షేమ పథకాలు ప్రజలకు టిడిపి ఎప్పుడు అండగా ఉంటుందని కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. ప్రభుత్వం ఏడాది పాలనలోనే అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించి ప్రజలకు సుపరిపాలన అందిస్తోందని అరకు పార్లమెంట్ కోశాధికారి పాడేరు మండలం ఎన్నికల అబ్జర్వర్ వంతల నాగేశ్వరరావు అన్నారు. ఇంటింటా కరపత్రాలు పంచుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అలాగే ప్రజలు శుక్రఫుట్టు గ్రామంలో నెలకొన్న సమస్యలు ఎన్టీఆర్ హౌసింగ్ పెన్షన్ డ్రైనేజ్ జిసిసి చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగూడ మండల సబ్ ఇన్స్పెక్టర్ పాపి నాయుడు పోలీస్ సిబ్బంది టిడిపి మాజీ మండల పార్టీ అధ్యక్షులు తుడుము సుబ్బారావు సర్పంచులు బాకురు వెంకటరమణ పాంగి పాండురంగ మాజీ సర్పంచ్ బోయిన పోత్తి మాజీ జెడ్పిటిసి సాగేని సుబ్బారావు డుంబ్రి గూడ మండల ఎన్నికల అబ్జర్వర్ రాము హరి బారికి నరసయ్య క్లస్టర్ ఇన్చార్జి రూడీ త్రినాధ్ టి.ఎన్.టియు మండ్యాగురు స్వామి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు గొల్లూరి ప్రసాద్ యూనిట్ ఇన్చార్జి యూత్ లీడర్ సాకేరి గోవింద్ జగ్గయ్య నోగేలి అర్జున్ సాకేరీ .సుమన్ ఎస్.ధర్మ కె.సుందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు