మేడ్చల్ : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని కందుకూరు మండలం ముప్పల గ్రామానికి చెందిన రాంబాబు తో ప్రశాంతి (22) వివాహం సంవత్సరం కిందటే జరిగింది .వీరికి ఐదు నెలల పాప ఉంది. రాంబాబు వృత్తి రీత్యా మేస్త్రీ పని చేస్తూ ఉండేవాడు. నెల రోజుల కిందట మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్లు అద్దెకు దిగారు. శుక్రవారం ఉదయం బంధువులు రాంబాబుకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో బంధువులు ఇంటికి వెళ్లి చూసేసరికి అప్పటికే ప్రశాంతి మృతి చెందింది. ఐదు నెలల పాప ఏడుస్తూ కనిపించింది.భర్త రాంబాబు ఇంట్లో లేకపోవడంతో హత్య చేసి పారిపోయాడని బంధువులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి మేడ్చల్ పోలీసులు చేరుకొని వివరాలను సేకరిస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
